KRNL: స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఉమ్మడి జిల్లా సైక్లింగ్ పోటీల్లో ఆళ్లగడ్డ వైపీపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల హెడ్మాస్టర్ వీరరాఘవయ్య బుధవారం తెలిపారు. అండర్-17 విభాగంలో ఎం.అనిత, కే. మాలిక్ కృష్ణా జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.