NTR: తిరువూరు పట్టణంలోని స్థానిక సాయి రాఘవ కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం సామాజిక కార్యకర్త రాంప్రదీప్ మున్సిపల్ కమిషనర్ లోవరాజుకు వినతిపత్రం అందజేశారు. రహదార్లు సక్రమంగా లేవని, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని, కుక్కల బెడద, కొందరు అమావాస్య రోజుల్లో చేతబడి చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.