ప్రకాశం : ఒంగోలు నగరంలో ఉచిత వంటగ్యాస్ పంపిణీ పథకంలో భాగంగా శుక్రవారం మహిళలకు దీపావళి కానుకగా, దీపం 2.0 కార్యక్రమాన్ని మంత్రి స్వామి, కలెక్టర్ అన్సారియా, ఎమ్మెల్యే జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలులో భాగంగా సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేశారని చెప్పారు.