ASR: రంపచోడవరం మండలం బోలకొండ గ్రామ సచివాలయం నుంచి ITDA ప్రాజెక్టు ఆఫీసర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లోని సిబ్బంది హాజరును ఆయన పరిశీలించారు. ప్రతిరోజు ఉదయం సిబ్బంది అంతా ఆయా గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సచివాలయం వచ్చే ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.