నెల్లూరు: విడవలూరు పట్టణంలోని శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక పుష్ప అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తదుపరి తీర్థప్రసాదాలను స్వీకరించారు.