ASR: బస్కి పంచాయితీ పివిటిజి గ్రామమైన బిజ్జగూడకు ఆ గ్రామ యువత శ్రమదానం చేసి స్వంతంగా మట్టిరోడ్డును చదును చేసుకున్నారు. సరైన రోడ్డు లేక ఆంబులెన్స్ గ్రామం వరకు రాలేకపోతుంది. దీంతో అనారోగ్యంతో ఉన్న వారిని ఆంబులెన్స్ వరకు సూమారు 2 కి.మీ డోలిమోత మోస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి మా గ్రామానికి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.