ప్రకాశం: కార్తీక మాసం ప్రారంభం కానున్న దృష్ట్యా నవంబర్ మూడవ తేదీ నుంచి భక్తుల సౌకర్యం కోసం ప్రముఖ శైవ క్షేత్రాలు అయినా పంచరామాలు, అరుణాచలం, శ్రీశైలం క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కనిగిరి డిపో మేనేజర్ మహమ్మద్ సయానా బేగం తెలిపారు. ప్రతి సోమవారం, పౌర్ణమి రోజులలో ఈ సర్వీసులు నడపడం జరుగుతుందని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.