VSP: పోర్ట్ హాస్పిటల్ ఏరియాలో బుధవారం ఉదయం స్కూల్ ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న స్కూల్ విద్యార్థులలో ఇద్దరికి గాయాలయ్యాయి, వీరితో పాటు ఓ మహిళ కూడా గాయపడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు. పోర్ట్ హాస్పిటల్ ఏరియా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.