పల్నాడు: మాచర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మత్తుపదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు టౌన్ ఎస్సై సంధ్యారాణి, కళాశాల ప్రిన్సిపల్ బాలయ్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ మేరకు ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు, టీచర్లు, పెద్దలతో గౌరవంగా మెలగాలన్నారు.