సత్యసాయి: సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్న తరుణంలో సెల్ ఫోన్ వాడకాన్ని దుర్వినియోగం చేస్తూ విద్యార్థులు, యువత పెడదారిని పట్టకూడదని హిందూపురం పట్టణ సీఐ కే.రాజగోపాల్ నాయుడు పేర్కొన్నారు. అమర వీరుల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం పట్టణంలోని వన్ టౌన్ స్టేషన్లో విద్యార్థులకు పోలీస్ శాఖపై అవగాహన కల్పించారు.