ATP: గుత్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని రివల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి అన్నారు. సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల, హాస్టల్‌ను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్.ఎస్.యూ జిల్లా కన్వినర్ రమేష్ బాబు పాల్గొన్నారు.