ప్రకాశం: వేటపాలెం సముద్ర తీరంలో ఉన్న పలు బీచ్ రిసార్ట్‌లను సోమవారం రాత్రి ఎస్సై వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసార్ట్‌లో సందర్శకుల రిజిస్టర్‌ను ఆయన పరిశీలించారు. రిసార్ట్‌కు వచ్చే వారి పూర్తి వివరాలు నమోదు చేయాలని, వారికి సంబంధించిన ఆధార్, పాన్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్సై వెంకటేశ్వర్లు రిసార్ట్ యజమానులకు సూచించారు.