అనంతపురం: రాష్ట్రంలో ప్రజా రంజక పాలన కొనసాగుతుందని, అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి పవన్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం గుంతకల్లులోని 20వ వార్డులో ఆయన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొని గడపగడపకు తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరించారు.