VZM: నెల్లిమర్ల మండలం కొండవెలగాడ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలలో సత్తాచాటారని పీడీ పతివాడ శ్రీనివాసరావు శనివారం వెల్లడించారు. మజ్జి మణికంఠ 65 కేజీల విభాగంలో బంగారు పతకం, రామాంజనేయులు 65 కేజీల విభాగంలో రజత పతకం సాధించారు. ఈ సందర్భంగా హెచ్ఎం జ్ఞాన శంకర్ పతకాల సాధించిన క్రీడాకారులను అభినందించారు.