GNTR: ఈనెల 19న రాజమండ్రి నందు 68వ ఎస్జీఎఫ్ రైఫిల్ షూటింగ్ అండర్-19 విభాగంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. పోటీల్లో సత్తెనపల్లి బాలికల హైస్కూల్ నుండి హాస్మా ప్రవీణ్, సరమిన్, మౌనిక, కేంద్రీయ విద్యాలయం నుండి జైఆదిత్య, ప్రభాకర్ మెరుగైన ప్రదర్శన చేసి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను స్కూల్ హెడ్ మాస్టర్ మాధవి అభినందించారు.