NDL: మినిమ సాగులో రైతులు పాటించాల్సిన పద్ధతులు, సాగు విధానంపై అవగాహన కల్పించడం జరిగిందని మండల వ్యవసాయాధికారి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఆత్మకూరు మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ మినుం పంటలో విత్తన శుద్ధి ఆశించే పురుగులు తెగుళ్లు గురించి గురువారం రైతులకు వివరించడం జరిగిందన్నారు.