ELR: మినీ గోకులాల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మినీ గోకులాల పథకం సంబంధించి లబ్ధిదారులైన రైతులకు, ఉపాధి పథకం సిబ్బందికి సమావేశం జరిగింది. ఎంపీడీవో మాట్లాడుతూ.. ఉంగుటూరు మండలానికి మొదటి విడతగా 65 మినీ గోకులాల షెడ్లు మంజూరు కావడం జరిగిందనన్నారు.