EG: రాజమహేంద్రవరం రూరల్ మాధవరాయుడుపాలెంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం పాల్గొన్నారు. ఆయనకు మాజీ సర్పంచ్ అన్నందేవుల చంటి, కూటమి నాయకులు స్వాగతం పలికారు. అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి వేదమంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు.