NDL: మహానంది క్షేత్రంలో మంగళవారం వైభవంగా నందీశ్వరాభిషేకం నిర్వహిస్తున్నట్లు వేద పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు. ఈవో ఎన్.శ్రీనివాస్ రెడ్డి ఆశ్వీయుజ బహుళ త్రయోదశి మహాప్రదోషం సందర్భంగా మంగళవారం సాయంత్రం 4-30కి ప్రదోషకాల నందీశ్వరాభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. పాల్గొనదలచిన భక్తులు రేపు మధ్యాహ్నం 3 గంటలకు మహానందిలో హాజరు కావాలన్నారు.