NLR: నగరంలో సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ వరకు ఇళ్ల మధ్యలో బ్రాందీ షాపులు వద్దంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆ పార్టీ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ.. వెంకటేశ్వరపురం, మైపాడు గెట్ సెంటర్, జగదీష్ నగర్, స్థలాల పక్కన మద్యం షాపులు ఏర్పాటు చేయడంతో స్థానిక మహిళలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.