VZM: ఎస్.కోట పట్టణ కేంద్రంలో ఉన్న ఆటో యూనియన్ నాయకులు, ఆటో చోదకులకు రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలపై ఎస్సై భాస్కరరావు, సిబ్బందితో శనివారం అవగాహన కల్పించారు. ఆటోలో పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని సూచించారు. ముందు సీట్లో ప్రయాణికులను కూర్చోబెట్టకూడదని హితవు పలికారు. సైబర్ నేరగాళ్లు పట్ల అప్రమత్తంగా మెలగలన్నారు. మత్తు పదార్థాలు సేవించకూడధన్నారు.