GNTR: అమెరికాలో పెట్టుబడుల జైత్రయాత్రను విజయవంతంగా పూర్తిచేసి అమరావతి విచ్చేసిన మంత్రి లోకేష్‌ను సహచర మంత్రులు ఉండవల్లి నివాసంలో కలిసి అభినందించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు, పరిశ్రమదారుల్లో నమ్మకం కలిగించడానికి మీరు పడుతున్న కష్టం తమకందరికీ ఆదర్శమని అన్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలబెడతాయని అన్నారు.