NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మట్టి మాఫియా విజృంభిస్తోన్నట్లు స్థానికులు ఆరోపించారు. సంగం మండలం నుంచి అక్రమ మట్టిని ప్రైవేట్ లేఅవుట్లకు యథేచ్ఛగా తరలిస్తూ సంపాదిస్తున్నారు. ముంబై జాతీయ రహదారిపై రాత్రంతా ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నా అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.