E.G: తమ వద్దకు వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి అన్నారు. మారేడుమిల్లిలో శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరి సమస్యను విన్నారు. పలు గ్రామాలకు చెందిన వారు పింఛన్లు ఇప్పించాలని, రేషన్ కార్డులు కావాలని, గ్రామాలకు రోడ్లు నిర్మించాలని అర్జీలు అందజేశారు.