మన్యం: పాలకొండ ఆర్టీసీ డిపో నుంచి పంచరామ పుణ్యక్షేత్రాలు అయిన శివ క్షేత్రాల సందర్శనకు నవంబర్ 3, 10, 17, 24వ తేదీల్లో బస్సు సర్వీసులు పాలకొండ నుంచి అందుబాటులో ఉంచినట్లు డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే శబరిమల యాత్రకు, కార్తీక మాసం పిక్నిక్లకు అద్దె బస్సులు అందుబాటులో ఉంచామని అన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.