VZM: చీపురుపల్లి మండల కేంద్రంలో గురువారం పిచ్చి కుక్క స్వైరవిహారం చేసి 40 మందిని గాయపరిచింది. బాధితులకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని వైసీపీ నాయకులు ఇప్పిలి అనంతం, వైస్ ఎంపీపీ పతివాడ రాజారావు పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.