ASR: జీకే వీధి మండలం దారకొండ ఘాట్ రోడ్లో ఇవాళ మంచు అందాలు పాల సముద్రాన్ని తలపించాయి. ఈ మంచు అందాలు పర్యాటకులను మైమరిపించాయి. దారకొండ దారాలమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో ఎత్తైన కొండల నడుమ మంచు అందాలు పలువురిని ఎంతగానో ఆకర్షించాయి. ప్రతి ఏడాది కార్తీక మాసం ప్రారంభం నుంచి డిసెంబర్ చివరి వరకు పర్యాటకులు తండోపు తండాలుగా వస్తుంటారు.