NTR: తిరువూరు మండలంలోని వావిలాల, మల్లేల గ్రామాల్లో 21వ అఖిల భారత పశుగనణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా డా. టి.శ్వేత మాట్లాడుతూ.. ప్రతి రోజు రైతు ఇంటికి వెళ్లి పశు గణన లెక్కలు తీస్తారని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అయిదు సంవత్సరాలకు ఒకసారి ఈ పశు గణన జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.