NLR: దుత్తలూరు మండలం బీసీ కాలనీలో పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మండల పరిధిలోని ముత్తరాశిపల్లి వద్ద బ్రిడ్జిపై నుంచి గూబల వాగు ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అవసరమైతేనే బయటికి రావాలని ఆయా లోతట్టు ప్రాంతాల గ్రామాల ప్రజలకు తెలిపారు.