ELR: దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం వంగురు పంచాయతీ కార్యదర్శి బదిలీలు జరిగి రెండు నెలలు అయినప్పటికి గ్రామ పంచాయతీకి ఇంతవరకు ఉన్నతాధికారులు కార్యదర్శిని నియమించలేదు. పంచాయతీ ఆఫీస్లో పని చేసే హెల్పర్లకు 5 నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఎవరి దగ్గరకి వెళ్లిన కార్యదర్శి రావాలి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.