కోనసీమ: రాజోలు MLA దేవ వరప్రసాద్ మంగళవారం నియోజకవర్గంలో పర్యటన వివరాలను పార్టీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10 గంటలకు మలికిపురం మండలం బట్టేలంక హైస్కూల్లో నిర్వహించే నియోజకవర్గ స్థాయి SGF ఆటల పోటీలు సెలక్షన్స్ కార్యక్రమం ప్రారంభిస్తారు. 3 గంటలకు ఈదరాడ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించే ఇది మంచి ప్రభుత్వం-ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు.