CTR: చిత్తూరు కేంద్రంలో నేడు పోలీసు సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఇ. భీమారావు, కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరుకానున్నారని చెప్పారు. ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాలకు అమరవీరులకు ఘన నివాళులు అర్పించనున్నట్లు చెప్పారు.