ATP: పెనుకొండ పట్టణ మావుటూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు VR రామాంజనేయులు అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత శుక్రవారం వారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు మంత్రి ఆర్థిక సహాయం చేశారు.