ELR: భీమడోలు మండలంలో ధాన్యం సేకరణ కార్యక్రమం పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఏలూరు ఆర్డీవో అచ్యుత్ అంబరీష్ కోరారు. భీమడోలు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం వివిధ అంశాలపై ఆర్డీవో వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ అధికారి ఉషారాణి మాట్లాడుతూ.. మండలంలో 13 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు జరిగిందన్నారు.