ప్రకాశం: అద్దంకి పట్టణంలో భవాని సెంటర్ నందు బుధవారం సాయంత్రం ఎస్సై ఖాదర్ భాషా ద్విచక్ర వాహనాలు తనిఖీ చేశారు. వాహనదారుల లైసెన్సులను ఆయన పరిశీలించారు. వాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని తప్పనిసరిగా లైసెన్స్‌ను కలిగి ఉండాలని ఎస్సై ఖాదర్ బాషా కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రమాదం సమయంలో హెల్మెట్ రక్షణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.