కృష్ణా: మాజీ సీఎం జగన్ సొంత తల్లిని, చెల్లిని బజారు పాలు చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. శుక్రవారం ఆయన టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. జగన్ చేతలతోనే అతడి తల్లి విజయమ్మ ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతోందన్నారు. ఆయన మానసిక స్థితిని గమనించి.. ప్రభుత్వం షర్మిలకు సైతం రాష్ట్రంలో భద్రత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.