గుంటూరు: మంగళగిరిలో ఇద్దరు చిన్నారులు జాతీయ రహదారి వెంబడి ఏడుస్తూ కాజ టోల్గేట్ వద్ద దర్శనమివ్వగా రూరల్ పోలీసులు సంరక్షణ నిమిత్తం స్టేషన్కు తరలించారు. చిన్నారుల ఆచూకీ కనుగొనాలని సోషల్ మీడియా ద్వారా పోలీసులు పిలుపునిచ్చారు. దీంతో పాత గుంటూరులోని తల్లి జయమ్మకు చిన్నారులను మంగళవారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.