VZM: విశాఖ జిల్లా విద్యాశాఖాధికారిగా బదిలీపై వెళ్తున్న ఎన్.ప్రేమ్ కుమార్ను డీఈవో కార్యాలయ అధికారులు, సిబ్బంది శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నూతన డీఈవో యు.మాణిక్యం నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.