W.G: పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 118.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా కాళ్ల మండలంలో 52.2, ఉండి 22.2, ఇరగవరం 19.0, పెనుమంట్ర 14.2, పెనుగొండ 4.2, నరసాపురం 2.8, యలమంచిలి, పెంటపాడు 1.4, ఆకివీడు 1.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు అయిందన్నారు.