E.G: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఆయన పి.గన్నవరంలోని క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27న పి.గన్నవరంలోని గ్రేస్ డిగ్రీ కళాశాల వద్ద నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేళాకు సంబంధించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు.