ASR: అల్లూరి జిల్లా సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలోని డొంకరాయి జలాశయం వద్ద బుధవారం రాత్రి 8 అడుగుల మొసలి హల్ చల్ చేసింది. అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగులు మొసలిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. జెన్కో సెక్యూరిటీ సిబ్బంది మొసలి మూతికి తాడు కట్టి జలాశయంలో విడిచి పెట్టారు. జలాశయంలో మొసళ్లు సంచరిస్తున్న నేపథ్యంలో పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.