కృష్ణా: నూజివీడు మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో గల శ్రీ అన్నే రామకృష్ణయ్య జడ్పీ హైస్కూల్ ఆవరణములో శనివారం గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంఛార్జ్ హెచ్ఎం రవీంద్ర మాట్లాడుతూ.. పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని, విద్యార్థులు క్రమశిక్షణతో ముందడుగు వేయాలన్నారు. అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మలను భారతీయ సంస్కృతిలో స్థిరాస్తిగా భావించాలన్నారు.