NDL: మండల కేంద్రమైన గడివేముల నుంచి తలముడిపికి వెళ్లే రహదారిలో రెండు పులి పిల్లలు సంచరించినట్లు రైతులు చెబుతున్నారు. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మంగళవారం ఉదయం పులల సంచారానికి సంబంధించిన పాదముద్రలు కూడా రైతులకు కనిపించాయి. రైతులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో అటవీ శాఖ అధికారులు పొలం వద్దకు చేరుకొని పరిశీలిస్తున్నారు.