అనంతపురం: గార్లదిన్నె మండలంలోని మిడ్ పెన్నార్ డ్యాం నుండి దక్షిణ హెచ్ఎల్సీ కాలువకు సోమవారం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఎంపీ అంభికా లక్ష్మి నారాయణ నీటిని విడుదల చేశారు. పంప్ హౌస్ వద్ద పూజలు చేసి మోటార్లు ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య సభ్యులు ఆలం నరసా నాయుడు, ముంటి మడుగు కేశవ రెడ్డి పాల్గొన్నారు.