SKLM: నందిగాం మండలం దిమ్మిడిజోల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త కొల్లి భాస్కరరావు ఇటీవల పాము కాటుకు గురయ్యారు. ఈ సందర్భంగా గురువారం వైసీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షులు గురునాథ్ యాదవ్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు వైసీపీ నాయకులు సుందరరావు, ఈశ్వరరావు, కృష్ణారావు, కూర్మారావు, తదితరులు ఉన్నారు.