KDP: కడప శివారులోని KSRM కాలేజీ ప్రక్కన ఉన్న శివప్రియ నగర్లో భూ కబ్జాదారుల దౌర్జన్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కడప కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ ఎదుట వారు నిరసన తెలిపారు. 27 ఏళ్ల క్రితం ప్లాట్లు విక్రయించిన ఈ ప్రాంతంలో భూములు అమ్మినవారే, ఇప్పుడు ప్లాట్లను తిరిగి నకిలీ రిజిస్ట్రేషన్లు చేసి భూ కబ్జాలు, దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు.