ప్రకాశం: కంభం పట్టణంలో అధికారులు ఉన్నారా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. కంభంలోని స్థానిక ఆల్ఫా స్కూల్ సమీపంలో రోడ్లు సరిగా లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిసిన సమయంలో మట్టి రోడ్లన్నీ బురదమయంగా మారి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.