VZM: ప్రత్యేక పునశ్చరణ భాగంగా శనివారం కొత్తవలస జూనియర్ కళాశాలలో ఓటు హక్కు నమోదు పై మండల తహసీల్దార్ బి.నీలకంఠరావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 2025 సంవత్సరం జనవరి 1వ తేదికి 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు ద్వారా నాయకుల భవితవ్యం తేల్చవచ్చని చెప్పారు.