SKLM: తుఫాను హెచ్చరికల దృష్ట్యా ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మార్వో ఎన్.వెంకటరావు గురువారం తెలిపారు. రానున్న మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కంట్రోల్ రూమ్ నంబర్ 9114115363కు ఫోన్ చేయాలన్నారు.