VZM: పాలు ప్రస్తుతం ఉన్న ధర కంటె 2 రూపాయల 30 పైసల మేర తగ్గడంతో పాడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని విశాఖ డైరీ పాడి రైతుల సంఘం అధ్యక్షులు లెంక సత్యనారాయణ ఆరోపించారు. శనివారం గంట్యాడలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ… పాల ధర కంటే తౌడు ధర ఎక్కువగా ఉండటం వలన తము పాలు పోయలేమని విశాఖడైరీ యాజమాన్యానికి తెలియజేశామని తెలిపారు.